Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాప్రభుత్వం కాదు.. పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం

ప్రజాప్రభుత్వం కాదు.. పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం

- Advertisement -

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రజా ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పార్టీ కార్యకర్తల కోసమే నడుస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అసహానం వ్యక్తం చేశారు. మండలం కొయ్యూరులో స్వర్గీయ పుట్ట లింగమ్మ స్మారకార్థం పుట్ట మధన్న ఫ్రెండ్లీ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ స్థాయి పుట్ట మధన్న ప్రీమియర్ లీగ్ సీజన్ -1 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణరెడ్డి, పుట్ట మధూకర్, మాజీ జెడ్పీ ఛైర్మన్ జక్కు శ్రీ హార్షిని రాకేష్, భీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డిలతో కలిసి క్రికెట్ టోర్నీ ప్రారంభించి మాట్లాడారు.

రాజకీయాలకు అతీతంగా క్రీడాభిమానుల కోసం నిర్వహించే క్రికెట్‌ టోర్నమెంట్‌ను రాజకీయం చేయడం సరైంది కాదన్నారు.రాజకీయాలు మాట్లాడే వేదిక కాకపోయినా పరిస్థితులు మాట్లాడేలా చేస్తున్నాయన్నారు. ప్రజలు ఎన్నుకోబడని ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలే కానీ పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం పనిచేయడం ఏంటని ప్రశ్నించారు.ఏ రాజకీయ పార్టీకైనా నాయకులు,కార్యకర్తలు,అభిమానలు ఉండటం సహజమని, అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఒక్క మంథనిలోనే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉందన్నారు.ఏనాడు లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజకీయాల్లో పెడదోరణి కన్పిస్తోందన్నారు.

ఇంత భయానక వాతావరణంలో ప్రభుత్వం నడిపిన చరిత్ర ఇప్పుడే చూస్తున్నామన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిపాలన చేసినా ఏనాడు పార్టీలు, రాజకీయాల గురించి ఆలోచన చేయలేదని, సాయం కోరిన వచ్చిన వ్యక్తిని న్యాయం చేశామే తప్ప ఆ వ్యక్తి ఎవరు, ఏ పార్టీ అని ఆలోచన చేయలేదన్నారు.ప్రస్తుత ప్రభుత్వం పోలీసులే ఆధారంగా నడుస్తోందని, ఎవరైనా సోషల్‌మీడియాలో పోస్టు పెడితే చాలు పోలీసులు స్పందించి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో మహేష్‌రెడ్డి నిర్వహిస్తున్న టోర్నమెంట్‌కు వివక్ష చూపుతున్నారని, మహేష్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని నమ్మి గొప్పగా పని చేశారని, ఆయన అనుకున్న విధానాలు ప్రభుత్వ పాలనతో కనబడకపోవడంతోనే బయటకు వచ్చాడని,అలాంటి ధైర్యం,తెగింపు ఉన్న నాయకుడి స్పూర్తి గొప్పదన్నారు.

మహేష్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ, నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థుల ఎత్తులకుపై ఎత్తులు వేసి విజయం సాధించుకునే దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మాట్లాడుతూ నమ్మినోళ్లను నట్టేట ముంచడం కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఈ టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టారన్నారు. గొప్పగా ఆలోచన చేసిన మహేష్‌రెడ్డి, వేముల శ్రీశైలం, మంథని లక్ష్మణ్‌రావు, బుర్రి నాగరాజులను ఆయన అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -