Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలురొటీన్‌ ప్రేమకథ కాదు

రొటీన్‌ ప్రేమకథ కాదు

- Advertisement -

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన సినిమా ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ మ్యూజికల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్‌ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్‌ చేస్తున్నారు. గురువారం హీరోయిన్‌ మానస వారణాసి మీడియాతో ముచ్చటించారు. ఇందులో మిత్ర అనే క్యారెక్టర్‌లో నటించాను. తను సరదా అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, అనుకున్నది వెంటనే చేసేస్తుంది.

కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటుంది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె డిగ్రీ చేసి జాబ్‌ కోసం చెన్నై వస్తుంది. మిత్రకు చెప్తా చెప్తా అనే డైలాగ్‌ ఊతపదం. ఈ మూవీలో చాలాసార్లు ఆమె నుంచి ఈ మాట వింటారు. మనం ప్రేమ కథల్లో అమ్మాయి, అబ్బాయి కలవడం, లవ్‌ చేసుకోవడం ఇలాంటివి చూస్తాం. కానీ ఇందులో ఆ రొటీన్‌ ప్రేమకథ ఉండదు. శివ, మిత్ర ప్రపంచాలు వేరు. వాళ్ల లక్ష్యాలు వేరు. వేరే ఊర్ల నుంచి చెన్నై వస్తారు. ఇలాంటి ఒక అమ్మాయి, అబ్బాయి కలవడమే అరుదైన విషయం. లివింగ్‌ టుగెదర్‌ కాన్సెప్ట్‌ను కొత్తగా చూపిస్తున్నాం. ఈ మూవీ నాకు, సంతోష్‌కు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. మూవీలో ఫన్‌ మూవ్‌మెంట్స్‌ ఉంటాయి. మిత్ర క్యారెక్టర్‌ మిమ్మల్ని నవ్విస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -