Tuesday, March 17, 2026
E-PAPER
Homeజాతీయంఆరేండ్లలో ఒక్క ప్రశ్నా లేవనెత్తలేదు

ఆరేండ్లలో ఒక్క ప్రశ్నా లేవనెత్తలేదు

- Advertisement -

– పాల్గొన్నది ఒకే ఒక చర్చలో..
– హాజరు కూడా 53 శాతమే
– ముగిసిన రంజన్‌ గొగోయ్‌ పదవీకాలం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (మాజీ సీజేఐ) రంజన్‌ గొగోయ్‌ తన ఆరేండ్ల పదవీకాలంలో ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తకుండానే రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత స్థలంలో ఆలయాన్ని నిర్మించడానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ధర్మాసనానికి నాయకత్వం వహించిన గొగోయ్‌కు గౌరవ సభ్యత్వం ఇవ్వడంపై అప్పట్లో తీవ్ర విమర్శలే వచ్చాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే చైర్మెన్‌ సిపి రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ… ఒక ప్రముఖ న్యాయ నిపుణుడిగా, గొగోయ్‌ అసమానమైన చట్టపరమైన చతురత, అనుభవాన్ని సభ చర్చలకు తీసుకువచ్చారని అన్నారు. ఆయన స్వరం తప్పిపోతుందని తెలిపారు. 2020 మార్చి 16న కేంద్ర ప్రభుత్వం నామినేషన్‌తో రాజ్యసభ సభ్యుడైన గొగోయ్‌.. ఆరు సంవత్సరాలలో ఒకే ఒక చర్చలో పాల్గొన్నారు. హాజరు శాతం కేవలం 53 శాతం మాత్రమే.

గొగోయ్‌ ప్రసంగం ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు, 2023కి మద్దతుగా ఉంది. దీనిని ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తగ్గించడానికి కేంద్రం ప్రవేశపెట్టింది. కానీ రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీసే బిల్లుకు ఆయన మద్దతు ఇవ్వటం గమనార్హం. ఈ వైఖరి 2017 ట్రిబ్యునల్‌ నిబంధనలను కొట్టివేసిన గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన ఆదేశానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రాజ్యసభకు వెళ్తానని గొగోయ్‌ ఒక ఇంటర్వ్యూలో అనడం గతంలో వివాదాస్పదమైన విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -