Sunday, October 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బహుజనుల ఆశాజ్యోతి కాక..

బహుజనుల ఆశాజ్యోతి కాక..

- Advertisement -

ఘనంగా కాక జయంతి..
నవతెలంగాణ – జన్నారం

బహుజనుల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు కాకా వెంకటస్వామి అని మాల మహానాడు మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల సురేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి జయంతి ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కాకా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివలర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాక చేసిన సేవలు మరువలేనివని అన్నారు అతని ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ,సంఘము నాయకులు బోట్ల సంజీవ్, భూమన్న, తౌటు సంజీవ్, పద్మారావు, బీసీ సంఘం తదితరులు పాల్గొన్నారు నాయకులు గోపి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -