మంత్రి పొగరు తగ్గించుకోవాలి ొ అవినీతి బాగోతంతో డిఫెన్స్‌లో ప్రభుత్వం
సరుకు, సమాధానం లేనప్పుడు తిట్లు ఎత్తుకుంటారు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ప్రెస్‌మీట్
నవతెలంగాణ- వనపర్తి
ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పొగరుతో లూటీ చేస్తున్నారని, పొగరులేటి, బాంబు లూటీ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి బాగోతం బట్టబయలు అయ్యేసరికి మంత్రి డిఫెన్స్‌లో పడి బూతులు, తిట్లు, పిట్ట కథలు చెప్పాడంటూ ఫైర్ అయ్యారు. సీఎం సహా మంత్రులందరూ అవినీతిపరులే అని మంత్రి పొంగులేటి ఒప్పుకున్నారని, ప్రాజెక్టుల విషయంలోనూ తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. గొల్లపల్లి- చిరుతపల్లి రిజర్వాయర్ అంశంపై వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో గురువారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అత్యంత పవిత్రమైన సచివాలయంలో పొంగులేటి మాటలు విన్నామని, నిజాలు దాటి అబద్ధాలు మాత్రమే మాట్లాడారని విమర్శించారు. సరుకు, సమాధానం లేనప్పుడు తిట్లు ఎత్తుకుంటారని అన్నారు. ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా.. రాఘవ కన్‌స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడి పొంగులేటి డిఫెన్స్‌లో పడ్డారని చెప్పారు. కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో పిట్ట కబుర్లు చెప్పి బయటపడాలని అనుకున్నారని ఎద్దేవా చేశారు. నేనొక్కన్నె అవినీతి పరుడున్ని కాదు.. మంత్రులందరూ అవినీతి పరులే అని తేల్చారన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహా రాష్ట్రంలో అందరి అవినీతి కుంభకోణాల చిట్టా ఆయనే చదివారన్నారు. ఆయనతోపాటు అందరినీ కలుపుకున్నారని ఎద్దేవా చేశారు.రాఘవ కన్‌స్ట్రక్షన్‌లో జరిగిన అవినీతిని మా అధికారులే గుర్తు పట్టారని, ఫైన్ కూడా కట్టారని స్వయంగా సీఎం చెప్పారన్నారు.
అనుమతులు ఆలస్యం అవుతాయని మైనింగ్ మంత్రి చెప్పారన్నారు. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పీసీబీ, మైనింగ్ ఇలా నాలుగు శాఖల అధికారులు ఇన్‌స్ఫెక్షన్ చేసి ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించారని చెప్పారు. ఈ అంశంలో పొంగులేటి చెప్పింది తప్పా.. అధికారులు చెప్పింది తప్పా..? ముఖ్యమంత్రి చెప్పింది తప్పా? మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా? అని ప్రశ్నించారు. ‘నీవేమో సంబంధం లేదని చెప్తున్నావు.. నీవి ఇంకా చాలా ఉన్నాయి.. అన్నీ బయటపెడతాం” అని హరీశ్‌రావు అన్నారు.పొంగులేటి పొగరు తగ్గించుకోవాలని, రాఘవకు మైనింగ్ లేదని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. అసెంబ్లీలో ఉండి కూడా తనది కాదని చెప్పలేదని విమర్శించారు. ఈ విషయంలో కంటైనర్ మీద రాఘవ కన్‌స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉందని, కాంగ్రెస్ జెండా ఎందుకు ఉందో సీఎం, మైనింగ్ మంత్రి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీబీ, మైనింగ్ అధికారులు నోటీస్ ఇస్తే.. తమ ఉద్యోగి రిసీవ్ చేసుకున్న కాపీని తాను అసెంబ్లీలో చూపెట్టానన్నారు. బాంబులేటి బుకాయిస్తున్నావ్.. వాస్తవాలు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
పొంగులేటి కాదు.. పొగరుతో లూటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



