ఎన్నికలకు అర్థం మారిపోయింది
పోటాపోటీగా తాయిలాలు పంపిణీ
నవతెలంగాణ – మల్హర్ రావు
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని చెబుతారు.పల్లెల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలను చూస్తే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్న అభ్యర్థులు గ్రామాల ఏ మేరకు అభివృద్ధి పాటుపడుతారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మొదటి, రెండవ ఎన్నికలు పూర్తియి బుధవారం మండలంలో మూడో దశ ఎన్నికలకు సర్పంచ్, వార్డులకు పోటీపడిన అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ప్రచ్ఛన్నం చేసుకునేందుకు డబ్బు,మద్యం పంపిణీ చేరవేశారు.
ఎక్కడా ఆనాటి స్ఫూర్తి.?
గ్రామాల్లో ఎన్నికలంటే సహజంగానే సందడి ఉంటుంది. కానీ ఆ సందడి అభివృద్ధి హామీలు ఇవ్వడంపై కాకుండా పరస్పర దూషణలు, పోటాపో టీగా తాయిలాలు పంపిణీ చేసేలా ఉండడంపై గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ఎన్నికల విధానం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాల్సిందిగా పోయి ‘నోటుస్వామ్యం’ మాదిరి వర్ధిల్లుతోందని చెబుతున్నారు. డబ్బు, మద్యమే ఎన్నికలను శాసి స్తున్నాయని, పార్టీ రహిత గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులను అద్ది అభ్యర్థుల తరపున ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.2వేలు ఇచ్చారని, ఇంకో చోట వరుసగా కొన్నిరోజుల పాటు ఇంటికే మటన్, చికెన్ పం పిణీ చేశారనే ప్రచారంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈమేరకు ఇటీవల గెలిచిన సర్పంచ్ లు వారిని పలకరించగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.



