ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కామారం(పిటి) గ్రామంలో మంత్రి సీతక్క పుట్టినరోజు పురస్కరించుకొని గురువారం ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేగ కళ్యాణి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, పలకలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కవిత, మాజీ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సావిత్రి, గ్రామ కమిటీ నాయకులు ఆనంద్, ప్రధానోపాధ్యాయులు సతీష్, మణెమ్మ, రేగ నరేందర్, సుస్మిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామారంలో విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES