- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ రచయిత, తెలంగాణ వాది కొంపల్లి వెంకట్ గౌడ్ గురువారం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశారు. వెంకట్ గౌడ్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జీవితం, అనుభవాలను ‘వొడువని ముచ్చట’ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్ రావు ఆలోచనలను ‘నీళ్ల ముచ్చట’గా పుస్తకాన్ని రాశారు. అలాగే పలువురు ప్రముఖలపై పుస్తక రచనలు చేశారు.
- Advertisement -