- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవి రామ రాజు(73) హైదరాబాద్ నల్లకుంటలోని తన నివాసంలో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. సుధాదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అమ్మ(కవితా సంపుటి), వినిపించని వేదన, రవళి తదితర కథా సంపుటిలతోపాటు, 500కిపైగా తెలుగు నాటికలు రాశారు. శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి 2005లో ఉత్తమ రచయిత్రిగా ‘వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక పురస్కారం’ అందుకున్నారు.
- Advertisement -



