Friday, October 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం149 మెడికల్‌ షాపులకు నోటీసులు : డీసీఏ

149 మెడికల్‌ షాపులకు నోటీసులు : డీసీఏ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా చట్ట విరుద్ధంగా అబార్షన్‌ కిట్లను విక్రయిస్తున్న 149 మెడికల్‌ షాపులకు డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ (డీసీఏ) షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మెడికల్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా అనధికారికంగా అబార్షన్‌ కిట్లు, అబార్షన్‌కు సంబంధించి కొన్ని ఔషధాలను మెడికల్‌ షాపులు అమ్ముతున్నట్టు గుర్తించారు. తనిఖీల్లో అవకతవకలకు పాల్పడిన మెడికల్‌ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు డీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాసీం ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -