2027 నవంబర్ వరకు రెండేండ్ల కాలపరిమితి
దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంపు
2011 జనాభా ప్రకారం ఎక్సైజ్ పన్ను వర్తింపు
వాక్‌ఇన్ స్టోర్లకు రూ.5లక్షలు అదనం
2025 డిసెంబరు 1 నుంచి కొత్త దుకాణాల నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ జీవో నెంబర్ 93ను జారీ చేశారు. కొత్త మధ్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేండ్ల కోసం లైసెన్స్‌లు జారీ చేయనున్నా రు. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులున్నాయి. మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్స్‌ల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది.దుకాణాల కేటాయింపులోనూ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆరు స్లాబ్‌ల ద్వారా లైసెన్స్‌లు జారీ చేయనున్నట్టు నోటిషికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించబడదు. ఒక వ్యక్తి లేదా సంస్థలు ఎన్ని దరఖాస్తులనైనా కొనుగోలు చేయవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్సైజ్ ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. 5 వేల జనాభాకు రూ.50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల జనాభాకు రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ. 60లక్ష లు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభాకు రూ.65 లక్షలు, ఐదు లక్షల నుంచి 20 లక్షల జనాభాకు రూ.85 లక్షలు, 20 లక్షలపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని షాపులకు రూ. కోటి పది లక్షలు ఏడాది ఫీజుగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.షాపులు పొందిన వారు ఆరు వాయిదాల్లో ఫీజు చెల్లించేందు కు వెసులు బాటు కల్పించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకూ, జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నడుపుకునే అవకాశం ఉంటుంది. 2023లో 1.32 లక్షల దరఖాస్తుల ద్వారా రూ. 2,645 కోట్లు ఖజానాకు సమకూరింది. ఈ సారీ లైసెన్స్ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో ఆదాయం రూ.3500 కోట్ల వరకు సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
వాక్ ఇన్ స్టోర్‌్….
మద్యం షాపు లైసెన్స్ పొందిన యజమాని ఏడాది టాక్స్‌తో పాటు అదనంగా రూ.5 లక్షలు చెల్లిస్తే వాక్‌ఇన్ స్టోర్ పెట్టుకునే అవకాశం కల్పించారు. ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ షాపులోకి వెళ్లి స్టోరంతా కలియ తిరుగుతూ ఇష్టమైన బ్రాండ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. 2023-25 పాలసీలో పొందుపర్చిన నిబంధనలే వాక్ ఇన్ స్టోర్లకు వర్తిస్తాయి.లైసెన్స్ పొందిన ప్రాంగణంలో ఐస్ బకెట్లు, ఐస్ టాంగ్స్, వైన్ కార్క్స్ స్క్రూలు, ట్రేలు, గ్లాసులు, గోబ్లెట్లు మొదలైన అన్ని మద్యం సంబంధిత ఉపకరణాలను నిల్వ చేసి విక్రయించడానికి అనుమతి ఉంటుంది.
మద్యం షాపుల కోసం నోటిఫికేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES