Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసాదాబైనామాల క్రమబద్ధీరణకు నోటిఫికేషన్‌ జారీ

సాదాబైనామాల క్రమబద్ధీరణకు నోటిఫికేషన్‌ జారీ

- Advertisement -

9 లక్షల మంది రైతులకు ఊరట

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో సుమారు 9 లక్షల మంది రైతులకు ఊరట లభించనుంది. భూభారతి చట్టం ప్రకారం క్రమబద్ధీకర ణకు రెవెన్యూశాఖ చర్యలు ప్రారంభించింది. 2020 ఆర్వోఆర్‌ చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు లేకపోవడంతో అప్పట్లో ఈ ప్రక్రియను న్యాయ స్థానం నిలిపివేసింది. దీంతో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు ప్రకటించారు. న్యాయస్థానంలో ఉన్న వివాద పరిష్కారానికి వారు పలు చర్యలు చేపట్టారు. దీంతో తాజాగా హైకోర్టు సాదాబైనామా రైతులకు 13-బీ ప్రొసీడింగ్స్‌ జారీ చేయడానికి అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో 2014 జూన్‌ రెండో తేదీకి ముందు వరకున్న సాదాబైనామా కొనుగోళ్లను 2016లో నాటి ప్రభుత్వం తొలిసారి క్రమబద్ధీకరించింది. అప్పట్లో 12.64 లక్షల దరఖాస్తులు రాగా.. పరిశీలన అనంతరం 6.18 లక్షల మేర క్రమబద్ధీకరించారు. రెండోసారి 2020లో క్రమబద్ధీకరణకు అవకాశమిస్తూ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.

కానీ ఆర్వోఆర్‌-1971ను సవరించి తెచ్చిన ఆర్వోఆర్‌-2020 చట్టం లో క్రమబద్ధీకరణకు సెక్షన్లు చేర్చలేదు. పైగా 2020 చట్టం అమల్లో కి రావడానికి ముందు, ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరించడం న్యాయ వివాదానికి దారితీసింది. 1971 నాటి చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసు కున్న దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావాలను కున్నప్పటికీ ఈ ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. అప్పుడు వచ్చిన 9,00,894 దరఖాస్తు లు పెండింగులో ఉన్నాయి. దీంతో ఆర్వోఆర్‌-2020 స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్వోఆర్‌-2025 భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం లోని సెక్షన్‌-6 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిం చారు. విచారణాధికారిగా ఆర్డీవోకు బాధ్యతలప్పగించారు. క్రమబద్ధీకరణ పూర్తయితే రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కావడంతో పాటు ప్రభుత్వా నికి రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల ద్వారా ఆదాయం రానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad