- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలలో ఆఫీస్ సబార్డినేట్ నుండి స్టెనోగ్రాఫర్ వరకు వివిధ పోస్టులున్నాయి. 18 నుంచి 46 ఏండ్ల లోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో రాత పరీక్ష ఉంటుంది.
- Advertisement -



