Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలి

టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలి

- Advertisement -

– రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం
వతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం నేతలు రావుల రామ్మోహన్‌ రెడ్డి, దుర్గం హరీశ్‌, శ్రీకాంత్‌ రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. డీయస్సీ నోటిఫికేషన్‌తో పాటు మోడల్‌ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలనీ, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని సవరించాలని వారు కోరారు. మోడల్‌ స్కూల్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసా చారికి కూడా వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -