Friday, December 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'బడ్స్‌ యాక్ట్‌'ను నోటిఫై చేయండి

‘బడ్స్‌ యాక్ట్‌’ను నోటిఫై చేయండి

- Advertisement -

సీఎంకు ఆర్బీఐ గవర్నర్‌ సలహా

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో అనియంత్రిత డిపాజిట్‌ పథకాల నిషేధ చట్టాన్ని (బడ్స్‌ యాక్ట్‌) నోటిఫై చేయాలని రిజర్వుబ్యాంక్‌ (ఆర్బీఐ) గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ఆర్బీఐ బోర్డ్‌ మీటింగ్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన మల్హోత్రా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయన్ని సన్మానించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ఆర్బీఐ గవర్నర్‌ ప్రశంసించారు. సీఎం రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటుపై ప్రాధాన్యతల్ని వివరించారు.

సోలార్‌ విద్యుత్‌ వినియోగం పెంచే దిశగా తీసుకుంటున్న చర్యల్ని చెప్పారు. అయితే ఆర్థికంగా మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఆర్బీఐ గవర్నర్‌ ఆకాంక్షించారు. యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ ఫేజ్‌ (యూఎల్‌ఐ) విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవను ఈ సందర్భంగా ఆయన సీఎంకు వివరించారు. ప్రభుత్వ, ప్రయివేటు డిపాజిట్స్‌ క్లెయిమ్‌ క్యాంపెయినింగ్‌పై చర్చించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, ఫైనాన్స్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఆర్బీఐ హైదరాబాద్‌ రీజనల్‌ డైరెక్టర్‌ చిన్మోయ్ కుమార్‌, జనరల్‌ మేనేజర్స్‌ మేజర్‌ యశ్పాల్‌ చరణ్‌, ఎస్‌ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -