Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇక ఆన్లైన్ విధానం.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు మూసివేత 

ఇక ఆన్లైన్ విధానం.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు మూసివేత 

- Advertisement -

బారికేడ్లు, ఫర్నిచర్ తొలగింపు
అక్రమంగా ప్రవేశించే వాహనాలపై కేసులు
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ఆఫ్ లైన్ విధానంలో పన్నుల వసూళ్లలో జరిగే అక్రమాలకు చెక్కుపెట్టినందుకు ప్రభుత్వం ఆఫ్లైన్లో విధానాన్ని తొలగించి ఆన్లైన్లో విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేయగా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు గాను ప్రస్తుతం రవాణా శాఖ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర సరిహద్దులలో తాత్కాలిక చెక్ పోస్టులను నిర్వహించారు. తాజాగా ప్రభుత్వం అంతరాష్ట్ర చెక్పోస్టులను ఎత్తివేయాలని ఆదేశించడంతో రవాణా శాఖ కమిషనర్ ఆదేశానుసారం అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉన్న చెక్ పోస్టులను బుధవారం మూసివేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న భారీ కేడ్ల, డ్రమ్ములును తొలగించారు. చెక్ పోస్టులలో ఉన్న రికార్డులు, ఫర్నిచర్, వాహనాల వివరాల దస్త్రాలను జిల్లా కేంద్రానికి తరలించారు. ఇకమీదట రాష్ట్ర సరిహద్దులలో చెక్పోస్టులు ఉండవు. వాహనాలు నేరుగా వచ్చి వెళ్లేందుకు అవకాశం కల్పించారు.

వాహనదారులకు ఇబ్బందులు కలిగించకూడదని కిందిస్థాయి రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో తాత్కాలికంగా ఉన్న చెక్పోస్టుల నిర్వహణ మూసివేశారు. చెక్ పోస్ట్ ల మూసివేత పై జిల్లా రవాణా శాఖ అధికారి లావణ్య బుధవారం వాడపల్లి చెక్పోస్ట్ ను నేరుగా పరిశీలించారు. ఫర్నిచర్, రికార్డులను జిల్లా కేంద్రానికి తరలించారు. భారీ కేడ్లు డ్రమ్ములను తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాలని సిబ్బందికి సూచించారు.

ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో రాష్ట్రవ్యాప్తంగా 15 చెక్పోస్టులు ఏర్పాటుకు కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాడపల్లి, నాగార్జునసాగర్, కోదాడ సమీపంలోని నల్లబండగూడెం వద్ద తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే వాహనాల నుంచి ఇప్పటి వరకు పన్ను వసూలు చేశారు. ఈ చెక్ పోస్టుల ద్వారా ప్రతినెల సుమారు రెండు కోట్ల వరకు ఆదాయం సమకూరగా ప్రభుత్వం ఆఫ్లైన్ విధానాన్ని తొలగించి ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

దీంతో చెక్ పోస్ట్ లను ఎత్తివేయగా ప్రస్తుతం ఆన్లైన్ విధానం కొనసాగనుంది. కాగా ఈ ఆన్లైన్ విధానం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వాహనదారులు పన్ను చెల్లించకుండానే రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించడంతోపాటు అనుమతులు లేకుండా తిరిగే వాహనదారులను గుర్తించి సరైన చర్యలు తీసుకున్నప్పుడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా పర్యవేక్షణ చేసేందుకు వాహనాలతో పాటు సిబ్బంది కూడా అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన స్క్వాడ్  బృందం పర్యవేక్షించాల్సి ఉంటుంది. 

ఇప్పటినుంచి ఆన్లైన్ విధానం 

ఆన్లైన్ పన్ను వసూలు కోసం ప్రభుత్వం వాహన యాప్ ను అమల్లోకి తెచ్చింది. ఈ విధానం అమలుల భాగంగా సరిహద్దు వద్ద రవాణా శాఖ ఏ ఎన్పిఆర్ (ఆటో నెంబర్ ప్లేట్ రీడర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఈ ఎన్ఫోర్స్మెంట్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలలో గుర్తించేలా దానికి వాహన యాప్ను అనుసంధానం చేశారు. తద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాలు తెలుస్తాయి. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు వాహనదారుల నిర్దేశించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి నగదు స్వీకరిస్తున్నారు. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే మొబైల్ టీములు వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తారు.

ఉన్నత అధికారుల ఆదేశాలను పాటిస్తున్నాం : రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్ (మిర్యాలగూడ)

రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నాం. ప్రస్తుతం అంతరాష్ట్ర సరిహద్దులలో ఉన్న చెక్ పోస్టులను మూసివేయాలని ఆదేశాలు అందాయి. ఆ మేరకు వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద ఉన్న చెక్ పోస్ట్లను ఎత్తివేసాం. అక్కడ ఉన్న భారీ కేడ్లను తొలగించి ఫర్నిచర్, రికార్డులను జిల్లా కేంద్రానికి తరలించాo. ఇకమీదట అంతరాష్ట్ర సరిహద్దులలో ఆన్లైన్ విధానంలోనే పన్నులు వసూలు చేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -