Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంఇక వందేభారత్‌ స్లీపర్‌

ఇక వందేభారత్‌ స్లీపర్‌

- Advertisement -

త్వరలో కోల్‌కతా- గువహతి మధ్య ప్రారంభం
పశ్చిమబెంగాల్‌, అసోం ఎన్నికల వేళ మోడీ వరాలు


న్యూఢిల్లీ : ఇక వందేభారత్‌లో స్లీపర్‌ రైలు పట్టాలెక్కనుంది. వందేభారత్‌ స్లీపర్‌ రైలును ముందుగా కోల్‌కతా-గువహతి మార్గంలో త్వరలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ గురువారం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఈ రైలు ప్రారంభిస్తామని తెలిపారు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అసోంలోని గువహతి మధ్య నడిచే ఈ వందేభారత్‌ రైలు టిక్కెట్‌ ధరలు విమానయాన చార్జీల కంటే తక్కువగానే ఉంటాయని తెలిపారు.

‘రానున్న 15 నుంచి 20 రోజుల్లో, సాధ్యమైనంత వరకూ ఈ నెల 18,19 తేదీల్లో ఈ సర్వీసును ప్రారంభింస్తాం. ప్రధానికి కూడా విషయాన్ని తెలిపాం. వచ్చే రెండు, మూడు రోజుల్లోనే నేను కచ్చితమైన తేదీని ప్రకటిస్తాను’ అని మంత్రి విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం గువహతి -హౌరా విమానయానానికి సుమారుగా రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకూ ఖర్చవుతుందని మంత్రి అశ్వని వైష్ణవ్‌ చెప్పారు. ‘వందేభారత్‌ రైలులో ఆహారంతో సహా థర్డ్‌ ఏసీ ఛార్జీ సుమారు రూ. 2,300, సెకెండ్‌ ఏసి చార్జీ రూ. 3 వేలు, ఫస్ట్‌ ఏసీ రూ. 3,600గా ఉండనుంది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ చార్జీలను రూపొందించాం’ అని మంత్రి తెలిపారు. కాగా, అసోం, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -