Saturday, January 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్‌పీడీసీఎల్‌కు 'ఇన్నోవేషన్‌ అవార్డ్‌'

ఎన్‌పీడీసీఎల్‌కు ‘ఇన్నోవేషన్‌ అవార్డ్‌’

- Advertisement -

నవతెలంగాణ – నక్కలగుట్ట
తెలంగాణ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్పీడీసీఎల్‌)కు ప్రతిష్టాత్మక ‘ఇప్పాయి పవర్‌ అవార్డు-2026’ లభించింది. ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన ఈ అవార్డుల్లో ఎన్పీడీసీఎల్‌ ‘ఇన్నోవేషన్‌ అవార్డు’ను కైవసం చేసుకుంది. ఈ నెల 10న కర్నాటక బెల్గాంలో జరిగిన 26వ రెగ్యులేటర్స్‌ డ పాలసీమేకర్స్‌ రిట్రీట్‌లో సీఈ (ప్రాజెక్ట్స్‌) సురేందర్‌ అవార్డును స్వీకరించారు. శుక్రవారం హన్మకొండ నక్కలగుట్టలోని కార్పొరేట్‌ కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డికి ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, ఎన్పీడీసీఎల్‌లో అమలు చేసిన ఏఐ రిస్క్‌ ప్రిడిక్షన్‌ మోడల్‌, రియల్‌ టైమ్‌ ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఆర్‌టీఏఫ్‌ఏంఎస్‌), ఫాల్ట్‌ పాసేజ్‌ ఇండికేటర్స్‌(ఏఫ్‌పిఐ) వంటి సాంకేతిక ఆవిష్కరణల వల్ల విద్యుత్‌ అంతరాయాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. అలాగే ప్రతి సోమ, మంగళ, బుధవారాలలో ప్రజావాణి, ప్రజాబాట, పొలం బాట కార్యక్రమాల ద్వారా వినియోగదారులకు నేరుగా సేవలు అందిస్తూ విద్యుత్‌ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -