పీఎఫ్‌ఆర్డీఏ చైర్‌పర్సన్ ఎస్.రమన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్)ను పారిశ్రామిక రంగాలకు చెందిన వారందరు అర్థం చేసుకునేలా సులభంగా మార్చి అందుబాటులోకి తేనున్నట్టు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) చైర్‌పర్సన్ ఎస్.రమన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, రెగ్యులేటరీ నాయకులు, ఆర్థిక రంగ నిపుణులతో రిటైర్ స్మార్ట్ ఇండియా అనే అంశంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రమన్‌తో పాటు రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కెఫిన్ టెక్ ఎండీ అండ్ సీఈవో శ్రీకాంత్ నాదెళ్ల పాల్గొని చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రమన్ మాట్లాడుతూ పెన్షన్ సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని తెలిపారు. ఇటీవల తెచ్చిన నిర్మాణాత్మక సంస్కరణలు, అనువైన అంశాలు, మల్టీ స్కీం ఫ్రేమ్‌వర్క్ పరిచయం, ఎన్పీఎస్ ఇస్తున్న అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చివరగా తాము డిజిటల్‌ను ఉపయోగించుకుని రిటైర్ మెంట్ తర్వాత ప్రతి ఒక్కరు సేవింగ్స్ ఉండేలా ఒక అలవాటుగా చేయడమేనని తెలిపారు. శ్రీకాంత్ నాదెళ్ల మాట్లాడుతూ సులభతరంగా రిటైర్మెంట్ సేవింగ్స్‌లోకి వచ్చేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.
అందుబాటులోకి ఎన్పీఎస్ ప్రయోజనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



