Wednesday, September 24, 2025
E-PAPER
Homeఖమ్మంఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం..

ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
జాతీయ సేవ పథకం దినోత్సవాన్ని బుధవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ పి.ఝాన్సీ రాణి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు సంఘసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.  డాక్టర్  కే.రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ సాంఘిక విషయాల పట్ల అవగాహన కల్పించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించి, విద్యార్థులు,కళాశాల సిబ్బందికి రక్తపోటు,మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

వైద్యాధికారి రామదాసు వివిధ రకాల జీవన సంబంధ వ్యాధుల గురించి,ఆహార అలవాట్లు,ఆరోగ్య పరీక్షలు విద్యార్థిని లలో వస్తున్న రక్తహీనత సమస్యను అధిగమించడానికి సూచనలను వివరించారు.  ప్రసాద్ మాట్లాడుతూ.. చికిత్స కంటే నివారణ మేలని వివిధ పరీక్షల ద్వారా ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఇంచార్జి  అసోసియేట్ డీన్ డాక్టర్ ఐ.వీ. శ్రీనివాస్ రెడ్డి, బోధనా సిబ్బంది డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ శ్రీ జన్,డాక్టర్ రాయల శ్రీనివాస్, డాక్టర్ జంబమ్మ, విద్యార్థులు భారీ ఎత్తులో పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -