Wednesday, September 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..

ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం  ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల  ప్రిన్సిపల్  సునీల్ మాట్లాడుతూ.. సమాజ సేవలో యువత ముందుండాలని, ప్రతి విద్యార్థి బాధ్యత, క్రమశిక్షణతో మెలగాలన్నారు. ప్రతి ఏడాది  సెప్టెంబర్ 24 రోజున ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామన్నారు. యువత మారితేనే సమాజం దానంతట అదే మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జ్ఞానేశ్వర్, వనజ, ప్రదీప్, రామారావు, నవీన్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, సుభాష్,  భీమేష్, హైమద్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -