- Advertisement -
నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణంలో గురువారం ఎన్ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ యు ఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ బొదిరే నాగమణి స్వామి, హాజరై ఎన్ ఎస్ యు ఐ యువకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ..విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు, విద్యార్థుల చదువుల సమస్యల పట్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు ఎప్పుడు ముందుంటుందని ఎన్ ఎస్ యు ఐ ముందంజలో ఉంటుందని అన్నారు. యువకులకు 56వ ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ యువకులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



