‘కాంతార’తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ ‘కాంతారా: చాప్టర్ 1’తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడంతోపాటు నటించారు. హౌంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసి, అంచనాలను భారీగా పెంచింది. ఈ హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తు ఈనెల 28న హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ ప్రీ రిలీజ్‌కి ఎన్టీఆర్ రాకతో సినిమా ప్రమోషన్‌కి మరింత బలాన్ని చేకూరుస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు. మైథాలజీ, రీజినల్ ట్రెడిషన్స్‌ని అద్భుతంగా ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఉండబోతోంది. అక్టోబర్ 2వ తేదీకి కౌంట్‌డౌన్ మొదలు కావడంతో ‘కాంతార: చాప్టర్ 1’ ఈ ఫెస్టివల్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. ఇక కథానాయకుడిగా రిషబ్‌శెట్టి నట విశ్వరూపాన్ని మరోమారు చూడబోతున్నాం. అలాగే ఆయన దర్శకత్వ ప్రతిభకు వెండితెర సాక్ష్యం కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా..
- Advertisement -
- Advertisement -