- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయివేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వెంటనే మరో రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ చివరికల్లా మొత్తం బకాయిలు ఒకే వాయిదాలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులు అంగీకరించాయి.
- Advertisement -

 
                                    