Monday, November 24, 2025
E-PAPER
Homeసినిమాఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు

ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు

- Advertisement -

అగ్రకథానాయకుడు ఎన్టీఆర్‌ గాయపడ్డారు. హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్న ఓ యాడ్‌ షూటింగ్‌లో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన కింద పడిపోయారు. వెంటనే వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించింది. వైద్యుల సలహా మేరకు పూర్తిగా కోలుకోవడానికి ఎన్టీఆర్‌ రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు ఎన్టీఆర్‌ టీమ్‌ తెలిపింది. అలాగే ఎన్టీఆర్‌ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను ఎవ్వరూ నమ్మవద్దని కూడా విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -