Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఎన్టీఆర్‌ ధన్యవాదాలు

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఎన్టీఆర్‌ ధన్యవాదాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు సినీ హీరో ఎన్టీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అదనపు షోలు, టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.75 (జీఎస్టీ సహా), మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 (జీఎస్టీ సహా) టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. పెరిగిన టికెట్‌ ధరలు ఆగస్టు 14 నుంచి ఆగస్టు 23 వరకు అమల్లో ఉండన్నాయి. ఇక అదనపు షో టికెట్‌ ధర రూ.500 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -