Sunday, May 11, 2025
Homeసినిమాసౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

- Advertisement -

ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ వేడుకలు సౌదీ అరేబియాలోని సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నందమూరి రామకష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్ధన్‌, నటి ప్రభ, బెనర్జీ, నందమూరి బిజిలి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరిం చారు. సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు కోనేరు ఉమా మహేశ్వరరావు, ఈవెంట్‌ చైర్మన్‌ కందిబేడల వరప్రసాద్‌, కార్య వర్గ సభ్యులు, ఇతర తెలుగు సంస్థల సహయ సహకారాలతో ఈ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నందమూరి రామకష్ణ మాట్లాడుతూ, ‘మా నందమూరి కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కడుపు నిండిపోతోంది. ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించిన సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య వారికి కతజ్ఞతలు. సమాఖ్య కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, ఇతరులకు ధన్యవాదాలు. ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలను దేశదేశాల్లో ముందుండి నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌ టి.డి.జనార్ధన్‌కు కతజ్ఞతలు. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అన్నట్లు మన తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా మన తెలుగు తేజం, తెలుగు గౌరవం, ప్రత్యేకత చాటుకుంటాం. ఎన్టీఆర్‌ నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రల్లో అద్వితీయ నటన చూపించారు. ఆయన తను పోషించిన ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగా మారారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -