Friday, October 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రభుత్వం నుంచి రావాల్సిన భారీ బకాయిల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా హెచ్చరించినట్లే, శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశాయి. రూ. 2,700 కోట్లకు పైగా బిల్లులు పేరుకుపోవడంతో, ఆర్థికంగా ఆస్పత్రులను నడపలేమని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

గత నెల 25వ తేదీనే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ‘ఆషా’ గుర్తుచేసింది. బకాయిలు చెల్లించకపోతే అక్టోబర్ 10 నుంచి సేవలు అందించలేమని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సమస్యపై ఆరోగ్య శాఖ అధికారులు ప‌లుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ‘అదిగో ఇదిగో’ అంటూ హామీలు ఇస్తున్నారే తప్ప, బకాయిలు విడుదల చేయడం లేదని ‘ఆశా’ ఆరోపించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం లేకపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -