- Advertisement -
ఐఎన్ఎస్ ‘అరిదమాన్’.. శత్రువులకు చిక్కని ‘తారాగిరి’
విశాఖపట్నం: భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అణుశక్తితో రూపొందించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమాన్ను లాంఛనంగా ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఫలితంగా అణు నావికాదళ విభాగం మరింత బలోపేతం అయింది. అంతకుముందు అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి శుక్రవారం జలప్రవేశం చేసింది. విశాఖ నేవల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా దీన్ని కమిషన్ చేశారు. ఈ కార్యక్రమానికి సీడీఎస్ జనరల్ అనిల్ చౌహన్, నౌకాదళ అధిపతి దినేశ్ కె.త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
- Advertisement -



