రూ.3.8 కోట్లు కొల్లగొట్టిన నిందితులు
సంయుక్త రెడ్డి పేరుతో ఈ వీడియోలు పంపిస్తూ ట్రాప్
నవతెలంగాణ-కల్వకుర్తి
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో న్యూడ్ వీడియోల వ్యవహారం కలకలం రేపింది.. పట్టణంలోని బలరాంనగర్ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలతోపాటు మరో వ్యక్తి గుర్తుతెలియని వ్యక్తులకు న్యూడ్ వీడియోలు పంపించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వ్యవహారం బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా పోలీసులు కల్వకుర్తికి వచ్చి నిందితులను అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కర్నూల్‌కు చెందిన ఓ వ్యక్తికి ట్విట్టర్‌లో న్యూడ్ వీడియోలు పంపించి.. ఆ తర్వాత ఓ మహిళ వీడియో కాల్స్ మాట్లాడి.. తక్కువ ధరకు పొలాలు, స్థలాలు అమ్ముతామని ఆ వ్యక్తిని నమ్మించి, రెండేండ్లలో రూ.3.8 కోట్లు కొల్లగొట్టినట్టు పోలీసులు గుర్తించారు. చివరికి మోసపోయానని బాధితుడు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన కర్నూల్ పోలీసులు ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమాళ్ల మేరి, స్నేహితురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీని అరెస్టు చేశారు. డిగ్రీ చదివిన వీరు సులభంగా డబ్బులు సంపాదించడానికి ఇలా అడ్డదారులు తొక్కారని పోలీసులు వెల్లడించారు. కొల్లగొట్టిన రూ.3.8 కోట్లలో, రూ.41.26 లక్షలతో రెండు కార్లు, బైకు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి.. మిగిలిన డబ్బును జల్సాలు, ఇతర అవసరాలకు ఖర్చు చేసినట్టు విచారణలో వెళ్లడైంది.
కల్వకుర్తిలో న్యూడ్ వీడియోల కలకలం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES