Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొర్రెల, మేకలకు వెంటనే నట్టల మందులు పంపిణీ చేయాలి..

గొర్రెల, మేకలకు వెంటనే నట్టల మందులు పంపిణీ చేయాలి..

- Advertisement -

జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి  దయ్యాల నరసింహ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

గొర్రెల మేకలకు వెంటనే నట్టల నివారణ మందులు పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం జిఎంపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ..మూడున్నర సంవత్సరాలుగా నటల నివారణ మందులు పంపిణీ చేయకపోవడంతో, గొర్రెలు నాణ్యత తగ్గి,  కాపరులు నష్టపోతున్నారని అన్నారు. కుక్కల దాడిలో చనిపోయిన గొర్రెలకు  నష్టపరిహారం ఇవ్వాలి. కుక్కల నివారణ చర్యలు చేపట్టాలి. గొర్రెలకు, మేకలకు ఉచిత భీమా సౌకర్యం కల్పించాలి.

గొర్రెల కాపరులకు పది లక్షల  ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. జిల్లాలో గొర్రెల దొంగతనాలను అరికట్టాలి. 50 సంవత్సరాలు దాటిన కాపర్లకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. ఉపాధి హామీలో గొర్ల షెడ్లను నిర్మించాలి. ఫారెస్ట్ భూములలో గొర్రెల మేతకు అనుమతులు ఇవ్వాలి. జిల్లాలో ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ, జిల్లా సహాయ కార్యదర్శి కొండే శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షులు మద్దె పురం బాల్ నరసింహ, సహాయ కార్యదర్శి నారీ వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు మన్నెబోయిన రాజలింగం,కర్రే మల్లేష్, భీమగోని బాలరాజు, వరి వెంకటేష్,మారగోని జంగయ్య, నెట్టు అంజయ్య, మన్నె బోయిన ఐలయ్య, మేకల మల్లేష్, నరాల రమేష్, మారేపల్లి శేఖర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -