- Advertisement -
నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామంలో గోర్లు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు త్రాగించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గుండు సుజాత శ్రీనివాస్ పాల్గోని కార్యక్రమాన్ని మండల పశు వైద్య అధికారి డాక్టర్ గంగా ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. గ్రామంలోని దాదాపు 2000 గోర్రేలు , మేకలు ఉన్నాయని వివరించారు.
ఉచిత నట్టల మందు 18 మంది గోర్లు మేకల వెంపకం దారుల జీవాలకు మందు త్రాగించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది జెవిఓ సిహెచ్.అర్ బాలగంగారాం, సుజాత, గోర్ల ,మేకల పెంపకం దారులు పాల్గొన్నారు.
- Advertisement -



