నవతెలంగాణ – తిమ్మాజిపేట
నేలలో పోషక లోపంతో రాబోవు తరాలకు నష్టం జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు తెలిపారు. మండలంలోని చేగుంట గ్రామంలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పాలెం అసిస్టెంట్ ప్రొఫెసర్లు విద్యార్థులు జాతీయ సేవ పథకంలో భాగంగా భూసార పరీక్ష పత్రం యొక్క ఆవశ్యకత గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ రమ్య మాట్లాడుతూ మట్టి పరీక్ష అనేది భూమిలో ఉన్న పోషకాలు సేంద్రియ పదార్థాల శాతం వంటి లక్షణాలను తెలుసుకునే శాస్త్రీయ పద్ధతి అని, మట్టి పరీక్ష ప్రాముఖ్యత గురించి వివరించారు.
అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ నవనీత మాట్లాడుతూ మట్టి నమూనా ఎలా సేకరించాలి ఎందుకు పరీక్ష చేయించాలో తెలిపారు. మట్టి పరీక్ష చేయడం వల్ల భూమి ఆరోగ్యం పంట దిగుబడి బాగుంటుందని తెలిపారు. రైతుబంధు కేంద్రాలు కృషి విజ్ఞాన కేంద్రాలు కెవికె వద్ద మట్టి పరీక్ష సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కళాశాల విద్యార్థులు తమ చార్టులు బొమ్మల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య విద్యార్థులు రైతులు పాల్గొన్నారు.
నేలలో పోషక లోపం.. రాబోవు తరాలకు నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES