Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీవాల ఎదుగుదలకు నట్టల నివారణే కీలకం

జీవాల ఎదుగుదలకు నట్టల నివారణే కీలకం

- Advertisement -

సర్పంచ్ యాసం సంధ్య రమేష్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

గొర్రెలు మేకలు అయినా జీవాల ఎదుగుదలకు నట్టల నివారణ కీలకమని నైనాలా గ్రామ సర్పంచ్ యాసం  సంధ్యా రమేష్ తెలిపారు. మంగళవారం మేకలు మరియు గొర్రెలకు నట్టల నివారణ మందులను నైనాల గ్రామ ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్, పశు వైద్యాధికారి డాక్టర్ సోమ శ్రీను తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూగజీవాళ ఎదుగుదలకు నట్టల నివారణ కీలకమని అన్నారు. వాటికి ఇంకా ఏదైనా సమస్య ఉంటే స్థానిక పశువైద్యాధికారిని సంప్రదించి తగ సూచనలు తీసుకొని వాటికి కావాల్సిన మందులను వేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్, వార్డ్ సభ్యులు ఆకుల వెంకటేష్, నారబోయిన రమ గుట్టయ్య, యాసం వెంకటేశ్వర్లు, పెద్దగొల్ల జగిరి సత్తయ్య,ఆవుల సాయిమల్లు,బత్తిని అజయ్, ఆకుల అనిల్,ఆకుల సాయిమల్లు,దాసరి నరేష్,వంగ భిక్షం, జగిరి వెంకన్న, ఆకుల బక్కులు, ఆకుల ఐలయ్య, జగిరి హన్మంతు, ఆకుల వెంకన్న, ఆకుల వీరయ్య, ఆకుల నర్సయ్య నన్నెబోయిన ముఖేష్, గోపాల మిత్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -