నవతెలంగాణ – పెద్దవూర
పేదలకు వరంగా పోషణ అభియాన్ కార్యక్రమం ఉపయోగ పడుతుందని అనుముల ప్రాజెక్టుసీడిపీఓ సువర్ణ అన్నారు. మంగళవారం మండలం లోని పెద్దగూడెం జెడ్పిహెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో పోషణ అభియాన్ సందర్బంగా గ్రామం లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు,అంగన్వాడీ లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. నేటి ఆధునిక జీవన విధానంలో నాణ్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారని ఇక చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాని తెలిపారు.
పండ్లు, పాలు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాల ఆహార పదార్థాల ను తీసుకుంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. పోషకాలతో వ్యాధి నిరో ధక శక్తిని పెంపొందించు కోవచ్చన్నారు. రక్తహీనత తగ్గి శారీరక మానసిక పెరుగుద లకు తోడ్పడుతుందన్నారు. పోషకాహార విలువల గురించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ శశికళ, అంగన్వాడి టీచర్లు కుసుమ, సుమలత,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి ఉపాధ్యాయులు అశోక్, చంద్రశేఖర్, మధుబాబు, దేవేందర్, శ్రీనివాస్ రెడ్డి చంద్రకళ పాల్గొన్నారు.
పేదలకు వరంగా పోషణ అభియాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES