- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిశోర బాలికలకు, గర్భిణీలకు బాలింతలకు పోషక ఆహారం తీసుకోవాలని హెచ్ఎం షమీమ్ ఫాతిమా సూచించారు. ఆకుకూరలు పాలు గుడ్లు పప్పు దినుసులు కూరగాయలు మొదలగునవి తీసుకోవాలన్నారు. కిషోర్ బాలికలు ఎదుగుదలకు మంచి పోషక ఆహారం తీసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జంగమ్మ షాజహాన్ అంగన్వాడి టీచర్ అలివేలు పాల్గొన్నారు.
- Advertisement -