Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీహెచ్సీలో పోషకాహార పంపిణీ..

పీహెచ్సీలో పోషకాహార పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి రోటరీ క్లబ్ మాతా శిశు సంరక్షణ పోషకాహార కార్యక్రమాన్ని స్థానిక అర్బన్ కాలనీ  సెంటర్లో పిఎస్ పిహెచ్సి సెంటర్లో నిర్వహించారు. భువనగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు పలుగుల ఆగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ విషయంలో గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్స్ అందిస్తున్నందుకు రోటరీ క్లబ్ వారిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలను ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి గ్రామీణ గిరిజన తాండ ప్రాంతాలలో నివసించే గర్భిణీలకు ఇలాంటి వస్తువులు కల్పిస్తే  ఎక్కువగా సార్ధకత అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.  రోటరీ సభ్యులు కు సేవా భవంతో పాటు విషయ పరిజ్ఞానం  మెండుగా ఉన్నదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హార్దిక సహకారాన్ని అందజేసిన క్లబ్ మెంబర్స్ పి రమేష్ బాబు, చేన్న సాయి కుమార్, లకు క్లబ్ అధ్యక్షులు నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారి డాక్టర్ యశోద, వైద్యులు డాక్టర్ నిరోషా, కార్యదర్శి తవిటి వెంకటనారాయణ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -