Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేవరాంపల్లి అంగన్వాడీలో పోషణ మాసం..

దేవరాంపల్లి అంగన్వాడీలో పోషణ మాసం..

- Advertisement -

 నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని దేవరాంపల్లి (రేగులగూడెం గ్రామపంచాయతీ) అంగన్వాడీ కేంద్రంలో సోమవారం రోజున “పోషణ మాసం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్( గంగారం సెక్టార్) సూపర్వైజర్ శ్రీమతి వీణ ఆధ్వర్యంలో నిర్వహించగా ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక రెడ్డి ప్రత్యేక అతిథిగా, కాటారం మండల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల గారు ప్రత్యేక అధితిగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా సిడిపిఓ రాధిక రెడ్డి మాట్లాడుతూ… పోషకాహార లోపం “సమాజ అభివృద్ధికి” అడ్డంకిగా మారకూడదన్నారు. ప్రతి అంగన్వాడి టీచర్ తన పరిధిలో ఉన్న బాలింతలు,గర్భిణీ స్త్రీలు ,చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలని తెలిపారు. ఆకుకూరలు ,పప్పులు, గుడ్లు, పాలు వంటివి తీసుకోవడం ద్వారా లభించే ప్రోటీన్స్, విటమిన్స్ ,మినరల్స్ మన శరీర రక్షణకు ముఖ్యమైనవని అన్నారు .వీటి గురించి సమాజంలో అవగాహన పెంచి పోషణ లోపం లేని సమాజం నిర్మించడానికి అందరం కృషి చేయాలని తెలియచేశారు.

పోషకారం, రూ. 1000 డేస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, చిన్న పిల్లల తల్లులుతో ప్రతిజ్ఞ చేయించారు.ప్రీస్కూల్ పిల్లల శాతాన్ని పెంచాలని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు. అనంతరం ముందస్తుగా అంగన్ వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగారం సెక్టార్ సూపర్వైజర్ వీణ,అంగన్వాడీ టీచర్స్ ఒన్న కమల దేవి, అన్నపూర్ణ,ప్రమీల,దివ్య, రోజా,ఆయలు, ఎ ఎన్ యం రజిత, ఆశ వర్కర్స్,గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -