Monday, September 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు17 నుంచి అక్టోబర్‌ 16 వరకు పోషణ మాసం

17 నుంచి అక్టోబర్‌ 16 వరకు పోషణ మాసం

- Advertisement -

– బరువు తక్కువున్న పిల్లలు 31.8 శాతం
– ఐదేండ్ల లోపు పిల్లల్లో 70 శాతం మేర రక్తహీనత బాధితులే
– ఈ ఏడాది 65 శాతానికి తగ్గించేలా సర్కారు లక్ష్యం
– పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు
– చిన్నారులు, మహిళల్లో పోషకాహార చైతన్య కార్యక్రమాలు
– ఇంటింటికీ సందేశం చేరవేయడమే సర్కారు లక్ష్యం : విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు లేఖ రాసిన మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలో ఐదేండ్లలోపు బరువు తక్కువ ఉన్న పిల్లలు 31.8 శాతం మంది ఉన్నారు. ఐదేండ్ల లోపు పిల్లల్లో 70 శాతం వరకు రక్తహీనత బాధపడుతున్నారు. అదే 15 ఏండ్ల నుంచి 19 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న యువతుల్లో 64.7 శాతం మంది రక్తహీనత బారినపడ్డారు. 15 ఏండ్ల నుంచి 49 ఏండ్ల లోపు మహిళల్లో ఈ శాతాన్ని చూసుకుంటే 57.6 శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటికీ సమతుల్య, పోషక ఆహారం తీసుకోకపోవడమే కారణమని స్పష్టమవుతున్నది. ఆర్థికలేమితో ఇబ్బంది పడుతున్న కుటుంబాలు చాలామేరకు పోషకాహారానికి దూరంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో ములుగు, కొత్తగూడెం, మెదక్‌, మహబూబాబాద్‌, వికారాబాద్‌, ఆసిఫాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో పిల్ల్లలకు సరైన పౌష్టికాహారం అందట్లేదని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. కొంతలో కొంత మేరకు నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు మిలెట్స్‌తో తయారు చేసిన చిక్కీలను అందించాలని రాష్ట్ర సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకున్నది. అయితే, అవి ఆసిఫాబాద్‌, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మాత్రమే కిషోర బాలికలకు అందుతున్నాయి. వారికి సరైన రీతిలో పోషకా హారాన్ని అందించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో విజయవంతం కాలేకపోతు న్నాయి. నిత్యం చైతన్య కార్యక్రమాలు జరుగుతున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదంటే అవి మొక్కుబడిగా జరుగుతున్నట్టే లెక్క. సమతుల్య ఆహారం అందించడంలోనూ, చైతన్యం కల్పించడం లోనూ పాలకులకు, ప్రజలకు మధ్య ఎక్కడో గ్యాప్‌ వస్తున్నదని స్పష్టమవుతున్నది. 2025-26లో ఐదేండ్ల లోపు రక్తహీనతతో బాధపడుతున్న పిల్లల శాతాన్ని 70 నుంచి 65 శాతానికి తగ్గించాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది.

17 నుంచి పోషణ మాసం
పోషక ఆహారం ప్రాధాన్యతను తెలిపేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు పూనుకున్నది. ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహౌత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించనున్నది. కార్యక్రమాలు చేప ట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుకు రూ.30,000, ప్రతి జిల్లాకు రూ.50,000 నిధులను విడుదల చేసింది. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్ర మాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపు లను ఐసీడీఎస్‌ నిర్వహించనున్నది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా కార్యచరణ సిద్దం చేసింది. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) లేఖలు కూడా రాశారు. తమతమ నియోజకవర్గాల్లో ఈ కార్య క్రమాలకు ప్రోత్సాహం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోషణ మాసం కాలంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మెగా హెల్త్‌ క్యాంపులు నిర్వహించి మహిళలు, యువతులకు రక్తనమూనా పరీక్షలు చేయించనున్నది. పోషణ మాసంలో బాగంగా ప్రతి రోజూ చేపట్టాల్సిన కార్యక్ర మాల జాబితా వివరాలను సిద్దం చేసి ఇప్పటికే జిల్లా లకు ఐసీడీఎస్‌ అధికారులు పంపారు. ఆయా కార్యక్ర మాలను రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో చేపట్టనున్నారు.

తక్కువ చక్కెర, ఉప్పు, నూనె వాడకంపై అవగాహన కల్పిస్తాం : మంత్రి సీతక్క
పోషణ మాసం సందర్భంగా చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటాం. జంక్‌ ఫుడ్‌ వినియోగాన్ని తగ్గించేందుకు, అలాగే చక్కెర, ఉప్పు, నూనె వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నాం. అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో ప్రతి ఇంటికీ పోషణ సందేశం తీసుకెళ్తాం. పోషణ మిషన్‌ ఈసారి పురుషులను కూడా భాగస్వామ్యం చేసి కుటుంబాల్లో పోషకాహారంపై సమగ్ర అవగాహన కల్పించాల న్నదే కార్యక్రమ ఉద్దేశం. ”వోకల్‌ ఫర్‌ లోకల్‌” నినాదంతో గ్రామీణస్థాయిలో ఉత్పత్తుల వినియో గాన్ని ప్రోత్సహించి ఆత్మనిర్భరతను పెంచే కార్యక్ర మాలు కూడా ఇందులో భాగమే. గ్రామస్థాయి లోనూ పోషణ డేటాను సేకరించి, వాటిపై క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాం. పోషణ తెలంగాణ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ మహౌత్సవాన్ని విజయవంతం చేసి, ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -