Friday, October 10, 2025
E-PAPER
Homeకరీంనగర్సిరిసిల్లలో పోషణ మాసం కార్యక్రమం

సిరిసిల్లలో పోషణ మాసం కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దాలనే నినాదంతో ప్రతి ఏటా పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిడిపిఓ ఉమారాణి పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపార సంఘ భవనంలో శుక్రవారం జరిగిన పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు.  గర్భిణీలకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాసన అక్షరాభ్యాసం వేడుకలు నిర్వహించడం జరిగింది. పోషకాహారంపై పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఆయిల్ మరియు షుగర్ వాడకాన్ని తగ్గించాలని, మంచి పోషణ ఆహారం కలిగిన పాలు, పండ్లు ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.  కార్యక్రమంలో సూపర్వైజర్ దివ్య, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత, డిసిపిఓ కవిత, సఖి సి ఎ మమత,దేవిక, రాజు, అంగన్వాడి టీచర్లు రజిని,శ్రీవాణి,శాంత, జయశ్రీ,జ్యోతి,సుధ,నాగలక్ష్మి ,విజయ,నీరజ,రేణుక,చిట్టి,అన్నపూర్ణ అంగన్వాడి ఆయాలు, గర్భిణీలు,బాలింతలు తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -