- Advertisement -
సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
అంగన్ వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహరం లబ్ధిదారులకు అందించాలని తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి సూచించారు. శనివారం ఎస్సికాలనిలోని అంగన్ వాడి కేంద్రాన్ని సర్పంచ్ తనిఖీ చేశారు. టీచర్, ఆయా సమయపాలన పాటిస్తున్నారా.. లేదాని అరా తీశారు. రోజువారీ రిజిస్టర్లు తనిఖీ చేశారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలు ప్రభుత్వం అందించే పోషకాహారాలను అందించాలని ఆదేశించారు. అనంతరం చిన్నారులకు, కిశోర బాలికలకు బాలామృతం, పల్లిమట్టిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, నారామల్ల రాజేశ్వరి, టీచర్ బాలమ్మ, ఆయా, ఐకెపి సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.
- Advertisement -



