ఐసిడిఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి
నవ తెలంగాణ-మల్హర్ రావు.
అంగన్వాడి కేంద్రాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే పోషకాహరాలు అందించడం జరుగుతుందని అంగన్వాడిల మండల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తెలిపారు.ఐసిడిఎస్ మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక ఆదేశాలతో మండలంలోని నాచారం అంగన్వాడి సెంటర్-1 సందర్షించారు.చిన్నారులకు,బాలింతలకు,గర్భిణీలు ప్రభుత్వం అందించే పోషకాహారాలను అందించాలని ఆదేశించారు.చిన్నారులకు,కిశోర బాలికలకు బాలామృతం,పల్లిమట్టిలు అందజేశారు.అనంతరం సర్పంచ్ ఒర్రె వణెమ్మ అధ్యక్షతన ఆరోగ్య లక్ష్మీ కమిటిపై సమావేశం నిర్వహించి,నూతన కమిటీ వేశారు.చిన్నారులకు అక్షరాబ్యాసం,అన్నప్రసన్న చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు,ఇంచా5 టీచర్ విజయ,ఆయా, ఆశాలు పాల్గొన్నారు.
అంగన్వాడిల్లో అర్హులైన వారికి పోషకాహారం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



