Monday, December 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'నువ్వు నాకు నచ్చావ్‌' రీ-రిలీజ్‌కి రెడీ

‘నువ్వు నాకు నచ్చావ్‌’ రీ-రిలీజ్‌కి రెడీ

- Advertisement -

24 ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్‌ 6 న తెలుగు తెర పై ఒక మ్యాజిక్‌ జరిగింది. అదే ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సినిమా. ప్రేక్షకులకు విందు భోజనం తిన్నంత ఆత్మ సంతప్తి. ఇప్పటికి చాలా సార్లు ఈ చిత్రాన్ని వీక్షించినా కూడా ఇంకా బోర్‌ కొట్టనంత రిపీట్‌ వేల్యూ ఉన్న కంటెంట్‌ ఇది. అందుకే 2026 కొత్త సంవత్సరాన్ని ఈ సినిమాతో చిల్‌ కావడానికి పూర్తి సాంకేతిక హంగులతో 4కెలో రీ రిలీజ్‌ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా అప్పట్లో విదేశాల్లో పూర్తి స్థాయిలో రిలీజ్‌ కాలేదు. ఆ లోటుని తీర్చడం కోసం కూడా ఈ సినిమా జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ, ‘తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి అయిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ ఇప్పుడు 4కెలో తిరిగి థియేటర్లలోకి వస్తోంది. ఇది కేవలం రీ-రిలీజ్‌ కాదు. జనవరి 1, 2026 కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారం భించడానికి ఇదే సరైన సమయం. 25 ఏళ్లుగా రకరకాల మాధ్యమాల్లో ఆస్వాదిస్తున్న ఈ అనుభూతిని ఇప్పుడు థియేటర్లలో సంపూర్ణంగా ఆస్వాదించండి. ఈ సినిమా చిత్రీకరణకు 87 రోజులు జరిగింది. ప్రతి రోజూ నాకు గుర్తుంది. ఎక్కడ ఏమేం తీశామో, ఎలా తీశామో, ఒక టీమ్‌ వర్క్‌ లాగా ఎంత ఇష్టపడి పని చేశామో అన్నీ గుర్తున్నాయి’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -