- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మెట్రో ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఆయన స్థానంలో హెచ్ఎండీఏ కమిషనర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్వీఎస్ రెడ్డి అర్బన్ ట్రాన్స్ పోర్ట్ సలహాదారుడిగా రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఎండీగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన ఎండీగా పదవీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది.
- Advertisement -