Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్‌ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్‌ రెడ్డి

- Advertisement -

నలుగురు ఐఏఎస్‌ల బదిలీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎన్‌.వీ.ఎస్‌.రెడ్డిని ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా)గా నియామకం చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎన్వీఎస్‌ రెడ్డిని హెచ్‌ఎంఆర్‌ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసిన ప్రభుత్వం.. మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్‌ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ అధికారిగా ఎం.రాజిరెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ సీఈవోగా జి.జితేందర్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్‌, హెచ్‌ఎండీఏ (సబ్‌-అర్బన్‌ రీజియన్‌) జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా, హెచ్‌ఎండీఏ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌ అండ్‌ మెట్రో రైల్‌) జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -