Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహేందర్ శవయాత్రలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు..

మహేందర్ శవయాత్రలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు..

- Advertisement -

– కార్యకర్తకు కన్నీటి వీడ్కోలు పలికిన నేతలు..
– ఆర్థిక సాయం అందించిన దాతలు..
నవతెలంగాణ – ఊరుకొండ 

సమాజంలో ఆత్మగౌరవం కోసం ఆరాటపడి.. తాను ఎత్తుకున్న జెండా కోసం కడవరకు నిలబడి.. కటిక పేదరికాన్ని కడుపులో మోస్తూ.. ఆత్మగౌరవం కోసం ఆరాటపడ్డ నిస్వార్థ నాయకుడు.. గెలుపుని అందుకోలేక ఓటమిని అంగీకరించలేక మధ్యలోనే గుండెపోటుతో అసువులు బాసిన గడ్డం మహేందర్ శవయాత్రలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు, నర్సంపల్లి మాజీ సర్పంచ్ వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ తన కార్యకర్తలతో కలిసి పాడే మోస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన దళిత మోర్చా మాజీ మండల అధ్యక్షులు గడ్డం మహేందర్ అంత్యక్రియలకు రాష్ట్ర నాయకురాలు బాల త్రిపుర సుందరి, పలువురు నేతలు హాజరై బాదిత కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్దాస్ నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.. గడ్డం మహేందర్ భారతీయ జనతా పార్టీలో కల్మషం లేని నిస్వార్థ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఉజ్వల యోజన పథకం ద్వారా ఉరుకొండ మండలంలో ఎంతోమందికి ఉచితంగా సిలిండర్లు పంపిణీ చేయడంలో మొట్టమొదటి పాత్ర పోషించారని.. మండలంలోని వృద్ధులకు నేత్రాల ఆపరేషన్ లు చేయించి ఎంతోమందికి కంటి చూపు తెప్పించిన కరడు కట్టిన కార్యకర్త గడ్డం మహేందర్ అని కొనియాడారు. ఇలాంటి కార్యకర్త లేకపోవడం పార్టీకి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ ప్రజా సంక్షేమం కోసం.. ప్రజల శ్రేయస్సు కోసం.. నీవు చేసిన సమాజ సేవ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పార్టీ బలోపేతానికి నీవు చేసిన పోరాటం.. నీ ఆరాటం నీ శ్రమ వృధా కాదు అని అన్నారు.

సమాజ సేవలో నిస్వార్ధంగా తన వంతు సహాయ సహకారాలు ప్రజలకు అందించిన ఇలాంటి నాయకుడు మళ్లీ రాడు అని కడసారిగా కన్నీటి  వీడ్కోలు పలికారు. బాధిత కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు, అన్ని పార్టీల నాయకులు, తాడెం చిన్న, నరేందర్ గౌడ్, రాజ్ నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ గౌడ్, పలువురు కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -