Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఓబిసి మేనిఫెస్టో నూతన రాజకీయం కోసం మార్గ సూచిక 

ఓబిసి మేనిఫెస్టో నూతన రాజకీయం కోసం మార్గ సూచిక 

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి
ఓబీసీ మేనిఫెస్టో నూతన రాజకీయాల కోసం మార్గ సూచిక అని, ప్రముఖ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి  హైకోర్ట్ న్యాయవాది పృధ్విరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓ బీసీల పోరుబాట పుస్తకాన్ని మహాగాథా సంస్థ ప్రచురించడం జరిగిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని బిఎంఎస్ కార్యాలయంలో పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బ్రిటిష్ పాలనలో కులవృత్తులపై సామాజిక ఆర్థిక దోపిడీ జరిగిందన్నారు. ప్రముఖ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ఆరేండ్లు, ఆరు రాష్ట్రాలు తిరిగి లోతైన పరిశోధనతో భారతదేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వాటి పరిష్కారాల కోసం ఈ పుస్తకంలో విఫలంగా పొందుపరచడం జరిగిందన్నారు. ప్రభుత్వ గుణాంకాలు అక్కడ మీకు అధ్యయనాలు ఫీల్డ్ రీసెర్చ్ ద్వారా సమకాలిన ఓబిసి స్థితిగతుల సమగ్ర విశ్లేషణ జరిగిందన్నారు. పుస్తక రచయిత పరికిపండ్ల నరహరి తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్ లో అత్యంత పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగిందన్నారు ఎన్నో ఒడిదలుకులు ఎదుర్కొని దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన ఐఏఎస్ సాధించి మధ్యప్రదేశ్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనేక పథకాలకు రూపకల్పన చేసి దేశంలోనే ఒక ప్రభావంతమైన ఐఏఎస్ అధికారుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన రచించిన పుస్తకం ఈనెల 14న హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆవిష్కరణ జరుగుతుందన్నారు. కార్యక్రమానికి మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ,ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లు ముఖ్య అతిథులుగా  హాజరు కానున్నారని తెలిపారు.ఈ సమావేశంలో  ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జగ్గయ్య, నాయకులు బట్టు రవి, మధుసూదన్ రెడ్డి ,కంబాల రాజయ్య,నాంపల్లి కుమార్, కోరే సుధాకర్, మునేందర్, శ్రీనివాస్, రఘు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad