Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి, సోయాబీన్ పంటల పరిశీలన..

పత్తి, సోయాబీన్ పంటల పరిశీలన..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
శనివారం మండలంలోని లాడేగావ్ గ్రామంలో సాగు అవుతున్న ప్రత్తి, సోయాబీన్ పంటలను క్షేస్త్రస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించి రైతు సోదరులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రత్తి పంటలో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అయిన పచ్చ దోమ, తెల్ల దోమ, పెనుబంక మొదలగు వాటిని గమనించి వాటి నివారణకు Imidacloprid+Acephate(Lancer gold) 250 గ్రాములు ఎకరాకు + వేప నూనె 1500ppm 500ml ఎకరాకు కలిపి లేదా అసిటమిప్రిడ్ 50గ్రాములు 200లీటరు ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

ఒక ఎకరం ప్రత్తి పండించడానికి 1DAP, 2 Urea ,1 potash  సంచి అవసరం ఉంటుంది. ఇందులో మొదటి 30నుండి 40 రోజుల్లో 1 సంచి DAP , సగం సంచి యూరియా వేసుకోవాలి. తర్వాతి 30 రోజుల తర్వాత మళ్లీ సగం సంచి యూరియా, సగం సంచి పొటాష్ వేయాలి. తర్వాతి 30 రోజుల తర్వాత మళ్లీ సగం సంచి యూరియా,సగం సంచి పొటాష్ అలా మొక్క పెరుగుదలను అనుసరించి ఎరువులు వేసినట్లయితే మొక్కకు కావలసిన ఎరువుల మొక్క పెరుగుదల అనుసరించి అందించడం వల్ల మొక్క ఏపుగా పెరిగి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అని వివరించడం జరిగింది.

 సోయాబీన్ పంటలో ముఖ్యంగా పచ్చ పురుగు, Stem girdle beetle, స్టెమ్ ఫ్లై ఉధృతిని గమనించి వాటి నివారణకు Profenophos 50EC @400ml ఎకరాకు + వేప నూనె 1500ppm @500ml ఎకరాకు + 19.19.19@1kg ఎకరాకు కలిపి పిచికారీ చేయాలని సూచించడం జరిగింది. స్టెమ్ ఫ్లై ఉదృతి ఎక్కువగా ఉంటే మొక్క చనిపోవడం జరుగుతుంది ఈ దశలో Chlrontriniprol+Lamda cyalothrin (Ampligo)100ml ఎకరాకు + 19.19.19@1kg ఎకరాకు కలిపి పిచికారీ చేయాలని సూచించడం జరిగింది. ఈ కేస్త్ర స్థాయి సందర్శనలో రైతు సోదరులు బాలయ్య, పవన్ కుమార్, సమీర్, షాదుల్ తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -