నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో సోమవారం నాడు క్షేత్రస్థాయిలో సాగు అవుతున్న పత్తి,పెసర మరియు సోయాబీన్ పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించి రైతులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రత్తి పంటలో ప్రధానంగా రసం పీల్చే పురుగులు అయిన పెనుబంక, పచ్చ పురుగు, తెల్లదోమ ఉధృతిని గమనించడం జరిగింది. దీని నివారణకు డిఫెంథియురాన్ +అసటమిప్రిడ్ (హెర్కులెస్) 250గ్రా” లు ఎకరాకు లేదా ఫ్లునోకమిడ్ (ఉలాల ) 50-60 గ్రా” లు ఎకరాకు 200 ల లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించడం జరిగింది. ఎక్కడయినా వర్షపు నీరు పంట చేనులో నుంచొని ఉంటే చిన్న కాలువలు తీసి బయటకు వదలాలి అని సూచించడం జరిగింది.
వర్షపు నీరు అలాగే ఉంటే మొక్కకు పరావేయిల్ట్ వచ్చి మొక్క చనిపోయే అవకాశం వుంటది. పర విల్ట్ నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్( సీఓసీ) 400గ్రాములు ఎకరాకు +19.19.19@1కిలో ఎకరాకు కలిపి పిచికారీ చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా పెసర పంటలో పొటాషియం లోపం, రసం పీల్చే పురుగులు మరియు పచ్చ పురుగు ఉదృతిని గమనించి నివారణకు అసిటమిప్రిడ్ 50గ్రాములు ఎకరాకు +13.0.45@1కేజీ ఎకరాకు + మంకోజబ్ +కార్బన్డైజమ్ (సాప్) ఎకరాకు 400గ్రాములు కలిపి పిచికారీ చేయాలని సూచించడం జరిగింది.
సోయాబీన్ పంట పూత దశలో ఉంది. సోయాబీన్ పంటలో ముఖ్యంగా పచ్చ పురుగు, బ్రైడల్ బాటమ్ గమనించడం జరిగింది. వీటి నివారకు ఇమామ్ యాక్టిన్ బెంజ (ఇఎమ్1)100గ్రాములు ఎకరాకు లేదా నోవాలురోన్ 100 ఎమ్ఎల్ ఎకరాకు లేదా ఫ్లూ బెండిమై న్ ( టాక్ మీ ) 100గ్రాములు ఎకరాకు దానితో పాటు 19.19.19@1కేజీ ఎకరాకు కలిపి పిచికారీ చేయాలని సూచించడం జరిగింది. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పురుగు మందులు పిచికారీ చేయాలని తెల్పడం జరిగింది.ఈ పంటల సందర్శనలో రైతు సోదరులు పాకాలి విట్టల్ , హన్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.