కలెక్టర్‌కు రైతు ఫిర్యాదు
నవతెలంగాణ శంకరపట్నం
శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలోని జక్కయ్య వారి కుంట ఆక్రమణపై అడితం మహేందర్ అనే రైతు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కుంటను 1956లో నిర్మించిన ఈ కుంట ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందుతోందని, దీనిపై వందలాది రైతులు ఆధారపడి ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే, గత కొంతకాలంగా ఓ రైతు కుంట మత్తడిని ధ్వంసం చేసి, కుంట శిఖం (కుంట భూమి)లో అక్రమంగా వరి సాగు చేస్తున్నారని మహేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అక్రమ సాగు వల్ల కుంటలో నీటి నిల్వ తగ్గిపోయి, తమ పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుంట ఆయకట్టుపై ఆధారపడిన తమలాంటి ఎంతో మంది రైతులు ఈ చర్యతో ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఇరిగేషన్ అధికారులు తక్షణమే విచారణ జరిపి, అక్రమ సాగు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు త్వరితగతిన స్పందించాలని మహేందర్ విజ్ఞప్తి చేశారు.